ఏపీ సీఎం చంద్రబాబు టీడీపీ డేటాను దొంగిలించిన వారు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారని నిప్పులు చెరిగారు. తెలుగుదేశం పార్టీకి చెందిన సమాచారాన్ని చోరీ చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుందని, అది ఆదిలోనే గంగపాలైందని ఆయన అన్నారు. వైసీపీ దొంగల ముఠా వదిలేసిన ఓ సాక్ష్యం తన వద్దకు చేరిందని, మధ్యాహ్నం ఒంటి గంటకు ఆ సాక్ష్యాన్ని బయటపెడతానని వెల్లడించారు. ఈ మేరకు మీడియాను ఆహ్వానించానని అన్నారు.
ఈ ఉదయం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా పార్టీ నేతలు, కార్యకర్తలతో మాట్లాడిన ఆయన, మరో రెండు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని, ఇక ప్రచారం, రాష్ట్రవ్యాప్త ప్రచారం, బహిరంగ సభలపై దృష్టిని సారిస్తామని ఆయన స్పష్టం చేశారు. టికెట్లు ఖరారైన అభ్యర్థులంతా విస్తృతంగా ప్రజల్లో తిరగాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణ రాష్ట్రం నుంచి రూ. 11,278 కోట్ల విద్యుత్ బకాయిలు రావాల్సి వున్నాయని, వాటి వసూలుకు అధికారులు కృషి చేస్తారని అన్నారు.
ముస్లింలకు బుద్ధి చెప్పాలంటే.. హిందువులు ముస్లిం మహిళలను రేప్ చేయాలి!: సునీతా సింగ్