telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మే 2 నుండి లాక్ డౌన్ : అసలు కథ ఏంటి ?

దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 1.42 కోట్లు దాటాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య. గడచిన 24 గంటలలో 2,17,353 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా… కరోనా వల్ల మొత్తం 1185 మంది మృతి చెందారు. ఇక గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 1,18,302 డిశ్ఛార్జ్ అయ్యారు. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,42,73,210 కాగా.. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 15,69,743 గా ఉన్నాయి. ఇక కరోనా కు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,25,47,866కి చేరింది.  దీంతో చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ కు మొగ్గుచూపుతున్నాయి. ఈ తరుణంలో కరోనా కేసులను క్యాష్ చేసుకుంటున్నాయి బుకీలు. దేశంలో లాక్ డౌన్ వార్తలపై భారీగా బెట్టింగ్ లు జరుగుతున్నాయి. మే 2 తేదీ నుండి లాక్ డౌన్ ఉంటుందంటూ బెట్టింగ్ చేస్తున్నారు బూకీలు. నెల రోజుల పాటు లాక్ డౌన్ ఉంటుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. దీంతో క్రికెట్ బెట్టింగ్ లాగే, లాక్ డౌన్ పై కూడా బెట్టింగ్ చేస్తున్నారు యూత్.ఈ నేపథ్యంలో లాక్ డౌన్ బెట్టింగ్ పై నిఘా పెట్టారు పోలీసులు. త్వరలోనే ఆ బుకీలను అదుపులోకి తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Related posts