రెండు తెలుగు రాష్ట్రాలలో కలకలం రేపిన బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో లో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో ఏ-1గా ఉన్న భూమా అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌పై సందిగ్ధత నెలకొంది… ఇప్పటికే ఆమె బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించడంతో.. సెషన్స్ కోర్టులో మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు అఖిల ప్రియ. అయితే… అఖిలప్రియ బెయిల్ పిటీషన్ పై సందిగ్దత ఇంకా కొనసాగుతూనే ఉంది. బోయినపల్లి కిడ్నాప్ కేసులో భూమా అఖిలప్రియ బెయిల్ పిటీషన్ పై ఇవాళ సెషన్స్ కోర్ట్ విచారణ జరుపనుంది. ఇదే కేసులో అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్, తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డిల ముందస్తు బెయిల్ పై విచారించనుంది సికింద్రాబాద్ కోర్టు. మూడు పిటీషన్ లపై నేడు విచారించనుంది కోర్టు. అయితే… మూడు బెయిల్ పిటీషన్ లపై కౌంటర్ దాఖలు చేయనున్నారు పోలీసులు. ఈ మూడు బెయిల్ పిటిషన్ లపై కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.