telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మాజీ ముఖ్యమంత్రికి కరోనా.. ఆస్ప‌త్రికి త‌ర‌లింపు

mulayamsingh yadav hospitalized

దేశంలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే దేశంలో కరోనా కేసులు 72 లక్షల మార్క్ ను దాటాయి. పేద, ధనిక అనే తేడా లేకుండా అందరికి ఈ వైరస్ సోకుతోంది. ఇప్పటికే దేశంలో చాలా మంది ప్రజాప్రతినిధులకు కరోనా సోకింది. చాలా మంది ప్రజాప్రతినిధులు, ప్రముఖులు కూడా ఆ మహమ్మారి కరోనాకు బలయ్యారు. తాజాగా.. ఉత్తప్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కు కూడా కరోనా సోకింది.

బుధవారం నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్నీ ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని ములాయం సింగ్ యాదవ్ కుమారుడు అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు. ప్రస్తుతం గురుగ్రామ్ లోని వేదంతా ఆస్పత్రిలో ములాయం సింగ్ యాదవ్ చికిత్స తీసుకున్నట్లు కూడా అఖిలేష్ తెలిపారు. ములాయం సింగ్ యాదవ్ కు లక్షణాలు లేకున్నా కరోనా సోకిందని పేర్కొన్నారు.

Related posts