telugu navyamedia
రాజకీయ వార్తలు సినిమా వార్తలు

తెలుగు ప్రజలకు ఎన్టీఆర్ గారి పైన ఉన్న నమ్మకానికి నిదర్శనం.

1983 లో జరగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున పార్టీ అధ్యక్షులు ఎన్.టి.రామారావు గారు పోటీకి నిలబెట్టిన అభ్యర్థుల్లో ఎక్కువ శాతం మంది చదువుకున్న వారే కావటం విశేషం. పోటీ చేసిన అభ్యర్ధులలో 125 మంది పట్టభద్రులు, 28 మంది పోస్టు గ్రాడ్యుయేట్లు, 20 మంది డాక్టర్లు, 47 మంది లాయర్లు, 8 మంది ఇంజనీర్లు ఉన్నారు. అభ్యర్థుల అందరి సగటు వయసు కేవలం 41 సంవత్సరాలు. అందులోనూ మహిళలు, వెనుకబడిన వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు ఎన్టీఆర్ గారు.

ఆ ఎన్నికల్లో మొత్తం 290 స్థానాలకు పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ 202 స్థానాలలో విజయ ఢంకా మోగించి శాసనసభ లో 2/3 మెజారిటీ సాధించి రికార్డ్ సష్టించింది. అప్పటివరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేదనుకున్న శ్రీమతి ఇందిరాగాంధీ కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

సినీనటులు రాజకీయాలకు ఎందుకు పనికివస్తారు అని అన్నవారందరి నోళ్ళు మూత పడ్డాయి. సినీ నటుడు గా ఎన్.టి.రామారావు గారిని ఆరాధించిన ప్రజలే ఆయనకు పట్టంకట్టి ప్రజానాయకుడిని చేశారు. ఇది తెలుగు ప్రజలకు ఎన్టీఆర్ గారి పైన ఉన్న నమ్మకానికి నిదర్శనం….

Related posts