telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

హెరిటేజ్ ని దెబ్బతీయాలని వ్యవస్థనే నాశనం చేస్తారా…?

chandrababu tdp ap

గుజరాత్ నుంచి అమూల్ తీసుకురావడం ఏమిటి అని చంద్రబాబు ప్రశ్నించారు. అధిక ధరకు వాళ్ళని తీసుకురావాల్సిన అవసరం ఏముంది ? అని ప్రశ్నించిన ఆయన హెరిటేజ్ ని దెబ్బతీయాలని వ్యవస్థనే నాశనం చేస్తారా ? అని ప్రశ్నించారు. హెరిటేజ్ ని దెబ్బ తీయటం మీ వల్ల కాదన్న ఆయన టీటీడీ పాలక మండలి లో సొంత సామాజికవర్గానికి అధిక ప్రాధాన్యం ఏమిటి ? అని ప్రశ్నించారు. సామాజిక ద్రోహం చేస్తూ అసత్యాలు చెప్తున్నారని, చట్టప్రకారం ఉపాధి హామీ పనులు చేసినవారికి ఇంత వరకు బిల్లులు చెల్లించకపోవటం దుర్మార్గం అని అన్నారు. కేంద్రం రూ.1860కోట్లు విడుదల చేసి 3రోజుల్లో చెల్లించమని ఆదేశాలిచ్చిందని సకాలంలో చెల్లించకుంటే 12శాతం వడ్డీ చెల్లించాలని హెచ్చరించినా పాత బిల్లులు పెండింగ్ లో పెట్టి కొత్త పనులుకెలా ఇస్తారు అని ఆయన ప్రశ్నించారు. వివిధ పథకాలపై ఎన్నికల ముందు జగన్ మాట్లాడిన పలు వీడియోలు ప్రదర్శించిన చంద్రబాబు ఆదాయం కంటే అప్పులు ఎక్కువ చేశారని అన్నారు. వీటికి రెవెన్యూ లోటు తోడైందని అన్నారు. ఇష్టానుసారం పన్నులు పెంచేశారని లెక్కలు తారుమారు చేస్తున్నారని అన్నారు. పంటల భీమా లో రైతుల్ని మోసం చేశారని ఆయన అన్నారు. 26లక్షల మందికే కట్టి 50లక్షల మందికి కట్టినట్లు అసత్యాలు చెప్పారని ఆయన అన్నారు.

Related posts