telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చంద్రబాబు నివాసంపై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

lakshmi-parvathi

టీడీపీ అధినేత చంద్రబాబు ఉండవల్లి నివాసంపై వైసీపీ నేత లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. . తాడేపల్లిలో ఈరోజు మీడియాతో ఆమె మాట్లాడుతో కరకట్ట మీద ఉన్న నీ ఇల్లు మీ నాన్న గారు ఏమన్నా వారసత్వ హక్కుగా తెచ్చి నీ పేరుతో రిజిష్టర్ చేసి పోయారా? అని ప్రశ్నించారు. ఆ అక్రమకట్టడంలో వేల కోట్ల డబ్బులు ఏమన్నా దాచిపెట్టావా? అని ఆమె ప్రశ్నించారు. సానుభూతితో చందాలు వసూలు చేసి నీకు ఇల్లు కట్టించి ఇవ్వమంటే అత్తగా నేను సిద్ధంగా ఉన్నానని వ్యాఖ్యానించారు.

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మృతి గురించి ప్రస్తావిస్తూ చంద్రబాబు, కోడెల బిడ్డల కారణంగానే ఆయన మృతి చెందారని ఆరోపించారు. కోడెలకు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వని చంద్రబాబు నీచమైన కుట్రలకు పాల్పడ్డారని విమర్శించారు. చంద్రబాబు శవరాజకీయాలు చేశారని దుయ్యబట్టారు. ఎన్టీఆర్ దగ్గర నుంచి నేటివరకు చంద్రబాబు ఒకే రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

Related posts