కరోనా వైరస్ కట్టడిచేసే నేపథ్యంలో వార్తా సేకరణలో ముందుండి సమాచారాన్ని సమాజానికి చేరవేస్తున్న జర్నలిస్టులతో పాటు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి ప్రభుత్వం కరోనా పరీక్షలు చేయాలని తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ప్రభుత్వానికి ఆమె లేఖ రాశారు.
కరోనాపై ప్రజలను అప్రమత్తం చేయడానికి వీలుగా సమాచారాన్ని అందిస్తోన్న జర్నలిస్టులు వైరస్ బారిన పడకుండా చూడాలని సూచించారు. దాంతో పాటు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది కూడా దీనిపై పోరు చేస్తున్నారని… వారందరికీ పరీక్షలు చేయాలని గవర్నర్ అన్నారు.