telugu navyamedia
సినిమా వార్తలు

హీరోయిన్ పై చెయ్యేసిన బోనీ కపూర్… ఫైర్ అయిన హీరోయిన్

Boney-Kapoor-with-urvasi-Rautela

ఇటీవల బాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ ఓ ఈవెంట్ కు హాజరయ్యారు. ఈ వేడుకకు మాజీ మిస్ ఇండియా, హీరోయిన్ ఊర్వశి రౌతేలా కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా బోనీ కపూర్ తో కలిసి ఊర్వశి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఫోటోలు తీసుకున్న తరువాత బోనీ కపూర్ ఆమెతో ఏదో మాట్లాడుతూ ఊర్వశి వెనుక భాగాన్ని తాకారు. అలా తాకరాని చోట తాకినప్పటికీ ఊర్వశి పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు కూతురు వయసున్న అమ్మాయితో ఇలాగేనా ప్రవర్తించేది ? అంటూ విమర్శిస్తున్నారు.

అయితే ఈ వీడియోపై స్పందించిన ఊర్వశి మాత్రం ఇదొక న్యూసా ? అంటూ ఈ వార్తను ప్రచురించిన ఓ న్యూస్ పేపర్ పై ఫైర్ అయ్యింది. అమ్మాయిలను గౌరవించడం తెలియనప్పుడు, దయచేసి విమెన్ లిబరేషన్, గర్ల్ పవర్ గురించి మాట్లాడకండి అంటూ సోషల్ మీడియా వేదికగా మండిపడింది. ఆమె ట్వీట్ చూసిన నెటిజన్లు మాత్రం అతడు నిన్ను తప్పుగా తాకినప్పటికీ నువ్వు మాట్లాడడం లేదు. అంత భయమెందుకు ? అంటూ ఊర్వశిని టార్గెట్ చేశారు.

Related posts