telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వెట్రిమారన్‌ ద‌ర్శక‌త్వంలో సూర్య… ‘వాడివాసల్‌’ ఫస్ట్ లుక్

Vadivasan

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ‘సూరరై పోట్రు’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాను తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’ అనే టైటిల్‌తో విడుదల చేస్తున్నారు. అపర్ణ బాలమురళి హీరోయిన్‌గా నటించింది. తెలుగులో వెంకటేష్‌తో ‘గురు’ సినిమాను తెరకెక్కించిన సుధా కొంగర ఇప్పుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. తాజాగా సూర్య హీరోగా వెట్రిమారన్‌ ద‌ర్శక‌త్వంలో ప్రముఖ నిర్మాత క‌లైపులి ఎస్. థాను నిర్మిస్తున్న తమిళ చిత్రం ‘వాడివాసల్‌’. హీరో సూర్య పుట్టిన‌రోజు సంద‌ర్భంగా విడుద‌ల‌చేసిన ఈ సినిమా ఫ‌స్ట్‌ లుక్‌కి మంచి స్పందన వ‌స్తోంది. ధ‌నుష్, క‌లైపులి ఎస్. థాను, వెట్రిమారన్ కాంభినేష‌న్‌లో వ‌చ్చిన ‘అసుర‌న్’ మూవీ బ్లాక్ బ‌స్టర్ విజ‌యాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగులో విక్టరీ వెంక‌టేష్ హీరోగా శ్రీ‌కాంత్ అడ్డాల ద‌ర్శక‌త్వంలో ‘నార‌ప్ప’గా తెర‌కెక్కిస్తున్నారు. కాగా, ప్రముఖ తమిళ ర‌చ‌యిత సీఎస్‌ చెల్లప్ప రాసిన నవల ఆధారంగా జల్లికట్టు నేపథ్యంలో ‘వాడివాసల్’ చిత్రం తెరకెక్కనుంది. సూర్య, వెట్రిమారన్‌ కాంబినేష‌న్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ మూవీ తమ బేన‌ర్‌లో మ‌రో సెన్సేష‌న‌ల్ సినిమా కాబోతుంద‌ని నిర్మాత క‌లైపులి ఎస్. థాను అన్నారు. ఈ సినిమాకు సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు త్వర‌లో తెలియ‌జేయ‌నున్నారు. ఈ చిత్రానికి ఆర్. వేల్‌రాజ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు.

Related posts