శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా ‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మహాసముద్రం’. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఈ సినిమా పోస్టర్లు ”హే రంభ” పాట నెటిజన్లను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ చిత్రం నుంచి మరో సాంగ్ విడుదల అయ్యింది. “చెప్పకే చెప్పకే ఊసుపోని మాటలు.. అంటూ సాగే ఈ సాంగ్‌ను హీరోయిన్ లక్కీ బ్యూటీ రష్మిక మందన చేతులమీదుగా విడుదల చేసింది.
చైతన్ భరద్వాజ్ సంగీతంలో వచ్చిన ఈ మెలోడి సాంగ్ ఆకట్టుకుంటుంది. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అలాగే ఈ సినిమాలో హీరోయిన్స్‌గా అదితీరావు .. అనూ ఇమ్మాన్యుయేల్ నటిస్తుండగా.. జగపతిబాబు ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు.
ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. అజయ్ సుంకర కో- ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. చాలాకాలం తరువాత సిద్ధార్థ్ నటిస్తున్న స్ట్రెయిట్ తెలుగు సినిమా ఇదే కావడం విశేషం. అలాగే ఈ సినిమాలో జగపతిబాబు ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు. ఈ సినిమా, అక్టోబర్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆర్ ఎక్స్ 100 సినిమాతర్వాత అజయ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో సినిమా పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్రయూనిట్ సమాచారం.
“అర్జున్ రెడ్డి” దర్శకుడిపై సెలెబ్రిటీలు ఫైర్… వివరణ ఇచ్చుకున్న సందీప్ రెడ్డి వంగా