telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రానా పెళ్ళిపై శ్రీరెడ్డి రియాక్షన్

టాలీవుడ్‌లో అయితే దిల్ రాజు, నిఖిల్‌, జబర్దస్త్ మహేష్‌ల పెళ్లిళ్లు వరుసగా జరిగాయి. ఇక దగ్గుబాటి రానా పెళ్లి బాజాలు త్వరలోనే మోగనున్నాయి. హైదరాబాద్‌కి చెందిన ప్రముఖ ఇంటీరియల్ డిజైనర్ మిహికా బజాజ్‌ను త్వరలో వివాహ మాడనున్నారు రానా. కాగా ఆయనకు శుభాకాంక్షల్ని తెలియజేస్తూ టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు ట్వీట్లు చేస్తున్నారు. రానా పెళ్లిపై స్పందిస్తూ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు వివాదాస్పద నటి శ్రీరెడ్డి. అయితే రానా పెళ్లి నేపథ్యంలో శ్రీరెడ్డి తనదైన శైలిలో విషెష్ అందించింది. కాబోయే పెళ్లి కొడుకు రానాకి విషెష్ అందిస్తూ.. ‘మీరు ఎంతవరకూ వెళ్లారో నాకు తెలుసు రానా గారూ.. ఆ అమ్మాయితో మీకు ప్రశాంతమైన జీవితం లభించేలా దేవుడు దీవిస్తాడు’ అంటూ ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి. రానా ఫ్యామిలీకి శ్రీరెడ్డికి పాత గొడవలు ఉన్న విషయం తెలిసిందే. అవే రానా తమ్ముడు అభిరామ్ తనను మోసం చేశాడంటూ ఆ ఫొటోలను తన ఫేస్ బుక్‌లో పెట్టి దగ్గుబాటి ఫ్యామిలీ పరువును బజారుకి లాగిన శ్రీరెడ్డి. సమయం వచ్చిన ప్రతిసారీ రానా, సురేష్ బాబు, వెంకటేష్‌లను వరసలు పెట్టి పిలుస్తూ వివాదాస్పద పోస్ట్‌లను షేర్ చేస్తుండేది. కానీ ఇటీవల కాలంలో మాత్రం యూట్యూబ్ లో తనకు వచ్చిన వంటకాలను పోస్ట్ చేస్తూ సైలెంట్ అయిపోయింది.

Related posts