టీం ఇండియా కెప్టెన్ కోహ్లీ, ఆయన భార్య అనుష్క శర్మలపై నెటిజన్లు ఆగ్రహానికి గురయ్యారు. దీపావళి పండుగ పూట తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. సోషల్ మీడియాలో వాళ్లిద్దరూ చేసిన పోస్టులపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. నెటిజన్లు వారిద్దరి తీరుపై మండిపడుతున్నారు. డ్రామాలు కట్టిపెట్టండంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. దీపావళి సందర్భంగా సెలబ్రిటీలందరూ వారి సోషల్ మీడియా ఖాతాలలో అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియాలో ఉన్న కోహ్లీ కూడా ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపాడు. పర్యావరణ హితంగా దీపావళి జరుపుకోవాలని కోరాడు. అదే కోహ్లి కొంపముంచింది. అనుష్క కూడా గ్రీన్ దివాళి అంటూ ఇన్ స్టాగ్రాంలో ఫోటోలు పెట్టింది. దీంతో నెటిజన్లు వారిద్దరిపై ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఇంట్లో అరడజన్ కార్లు… ప్రయివేట్ జెట్ ఉన్న వ్యక్తి పర్యావరణం గురించి మాట్లాడటం హస్యాస్పదంగా ఉందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఆ కామెంట్ చూసి మరికొంత మంది కోహ్లిపై సెటైర్లు వేయడం మొదలు పెట్టారు. మరికొందరైతే పర్యావరణానికి పాటుపడుతున్న వారి ఫోటోలను, కోహ్లి ఫోటోలను కలిపి… ఎవరు పర్యావరణాన్ని కాపాడుతున్నారు అంటూ పోల్స్ కూడా నిర్వహించారు.