telugu navyamedia
తెలంగాణ వార్తలు

జూబ్లీహీల్స్ రేప్ కేసు : ఇంగ్లీష్ సినిమాలు, వెబ్‌సీరీస్ లు చూసి రేప్‌కు పాల్ప‌డిన నిందితులు

*జూబ్లీహీల్స్ రేప్ కేసులో కీల‌క అంశాలు..

*ఇంగ్లీష్ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చూసి రేప్‌కు పాల్ప‌డిన నిందితులు

*బెంజ్‌కారును మైన‌ర్లు న‌డిపిన‌ట్లు ఆధారాలు..
*బాలిక‌కు ఆశ ఆస్పత్రిలో చికిత్స చేయించిన‌త‌ల్లిదండ్రులు
*బాలిక‌ను తీసుకెళ్లిన హాదీని ప్ర‌శ్నించిన త‌ల్లిదండ్రులు
*బెదిరింపుల‌కు పాల్ప‌డిన ఫోన్ ఎమ్మెల్యే బంధువులు..

జూబ్లీహిల్స్‌లోని అమ్నేషియా పబ్‌ కేసులో ప్రధాన నిందితుడు సాదుద్దీన్‌ మాలిక్‌తో పాటు మైనర్ల పోలీసు కస్టడీ నేటితో ముగిసింది. కస్టడీలో అనేక విషయాలను పోలీసులు రాబట్టినట్లు తెలిసింది.

లైంగిక దాడి ఘటనలో నిందితుల్లో పశ్చాత్తాపం కనిపించలేదట‌. ఇంగ్లీష్ సినిమాలు, వెబ్ సీరీస్ లు చూసి తాము ఈ దారుణానికి పాల్పడినట్టుగా నిందితులు పోలీసుల విచారణలో పేర్కొన్నట్టుగా మీడియా కథనాలు చెబుతున్నాయి.  

కార్పొరేటర్ కుమారుడు ప్రోత్సహించడం వల్లనే బాలికపై అత్యాచారం చేశామని పోలీసులకు మైనర్లు చెప్పినట్లు తెలిసింది. మైనర్లకు బెంజ్ కారు ఇచ్చిన ఎమ్మెల్యే కుమార్తెపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. బెంజ్ కారు నడిపిన మైనర్ కుటుంబ సభ్యులపై కూడా కేసు నమోదైంది.

బెంజ్‌ కారును పోలీసులకు చిక్కకుండా కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేశారు. బెంజ్‌ కారు విషయంలో నిందితుల కుటుంబ సభ్యులు.. పోలీసులను తప్పుదోవపట్టించారు.

మరోవైపు ఇన్నోవా కారును వక్ఫ్ బోర్డు ఛైర్మన్ కు ప్రభుత్వం అధికారికంగా ఎటువంటి వాహనాన్ని కేటాయించలేదని పోలీసులు చెబుతున్నారు. ఆయన సొంత కారుపైనే గవర్న్‌మెంట్ స్టిక్కర్ వేసుకుని తిరుగుతున్నారన్నారు. ఇంటి నుంచి మాత్రం డ్రైవర్ ఇన్నోవా కారును పబ్ కు తీసుకెళ్లాడని తేల్చారు. కాన్సూ బేకరీ వద్ద డ్రైవర్‌ను దింపేసి కారును మైనర్లు తీసుకెళ్లార‌ని పోలీసులు చెబుతున్నారు. . ఇన్నోవా కారు దొరక్కుండా ప్రయత్నాలు చేశారు.

బాలిక గొంతుపై గాట్లు ఉండటంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుకు ముందే బంజారా హిల్స్‌లోని ఆశ హాస్పిటల్‌లో మైనర్‌కు సైకియాట్రిస్ట్ ద్వారా కౌన్సిలింగ్ ఆమె పేరెంట్స్‌ కౌన్సిలింగ్‌ ఇప్పించారు. తమ కూతురుపై ఎవరో అఘాయిత్యానికి పాల్పడినట్లు అనుమానించి, బాలికను పబ్‌కు తీసుకువెళ్లిన హాదీని మైనర్ పేరెంట్స్‌ ప్రశ్నించారు.

మైనర్‌ను పబ్‌కు తీసుకు వెళ్లింది ఎమ్మెల్యే బంధువు కుమారుడని చెప్పడంతో ఘటన బయటకు వచ్చింది. దీంతో, నిందితులు ఎమ్మెల్యే తనయుడు బాలిక కుటుంబ సభ్యులను బెదిరించారు.

ఇక, ఇన్నోవా కారులోనే మైనర్‌పై ఐదుగురు నిందితులు లైంగిక దాడి చేశారు అని వెల్లడించారు.
వీడియో షూట్ చేసిన మైనర్ పై మిగిలిన నిందితులు ఆగ్రహం వ్యక్తం చేశారని, వీడియో షూట్ వల్లనే కేసుల్లో చిక్కుకున్నామని మిగిలిన నిందితులు అతనిపై చేయి చేసుకున్నారని కూడా పోలీసులు చెబుతున్నారు.

Related posts