telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

విదేశీ విద్య కోసం రూ.20 లక్షల సాయం: వినోద్‌ కుమార్‌

vinod kumar trs

పేదలు విదేశాల్లో విద్యను అభ్యసించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి రూ. 20 లక్షలు ఆర్థిక సాయం చేస్తోందని మాజీ ఎంపీ, ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ వినోద్‌ కుమార్‌ తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని సూచించారు. అమెరికా తెలుగు అసోసియేషన్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో జరిగిన విద్యా సదస్సులో వినోద్‌ కుమార్‌ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

పార్లమెంట్‌లో వచ్చే బడ్జెట్‌ సమావేశాల్లో నూతన విద్యా విధానం బిల్లు ఆమోదం పొందగానే తెలంగాణలో విదేశీ యూనివర్సిటీలు ఏర్పాటు కావడం ఖాయమని చెప్పారు. విద్యతోపాటు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు, నైపుణ్యాలు పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. విదేశాల్లో విద్యను అభ్యసించాలని అనుకునే విద్యార్థులు యూనివర్సిటీల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.

Related posts