మహారాష్ట్ర ప్రజలకు ఏక్‌నాథ్ షిండే సర్కార్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెట్రోల్, డీజిల్‌పై భారీగా వ్యాట్‌ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 వ్యాట్ తగ్గించింది.
కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక.. అక్కడ కరెంట్ చార్జీలు 10-20 శాతం మేర పెరిగాయి. ఈ క్రమంలో ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో.. ఇప్పుడు ఇంధన ధరలను తగ్గిస్తూ వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. .
మంత్రాలయలో ఇవాళ షిండే నేతృత్వంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఇందులో పెట్రోల్, డీజిల్ వ్యాట్‌పై నిర్ణయం తీసుకున్నట్లు ఏక్‌నాథ్ షిండే తెలిపారు.
పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుతో.. మహారాష్ట్ర ప్రభుత్వంపై ఏటా రూ.6వేల కోట్లు అదనపు భారం పడుతుందని మంత్రివర్గ సమావేశం అనంతరం షిండే విలేకరులకు వెల్లడించారు . సామాన్య పౌరులకు మేలు జరగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా డిప్యూటీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ… శివసేన-బీజేపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమం విషయంలో ఎంత నిబద్ధతతో ఉందో తాము తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా స్పష్టమవుతుందని అన్నారు
ముంబైలో ప్రస్తుతం రూ. 111.35 గా ఉన్న పెట్రోల్ ధర తాజా తగ్గింపుతో.. రూ.106.35కి దిగనుంది. అలాగే డీజిల్ ధర రూ.97.28 నుంచి 94.28కి తగ్గింది. ఈ ధరలు రేపటి నుంచి అమల్లోకి వస్తాయి.
పుణెలో రేపటి నుంచి లీటర్ పెట్రోల్ ధర రూ.,105.88 డీజిల్ ధర రూ.92.37గా ఉండనుంది. థానెలో పెట్రోల్ రేటు రూ.106.49, డీజిల్ రూ.94.42కి తగ్గుతుంది.
నాకు సంక్షోభాలు కొత్తకాదు..నేను పోరాటం కొనసాగిస్తా: చంద్రబాబు