telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సురవరం జయంతోత్సవ లోగో ఆవిష్కరణ…

తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి 125 వ జయంతి ఉత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఇవాళ బషీర్‌బాగ్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ తో పాటు, పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురవరం జయంతోత్సవ లోగోను ఆవిష్కరించారు. అనంతరం  కేటీఆర్ మాట్లాడుతూ…. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ముఖ్యమైన అంశం సాంస్కృతిక పునరుజ్జీవనమని.. పివీని, సురవరంను స్మరించుకునే అవకాశం వచ్చిందన్నారు.  సురవరం కుటుంబం ఏమి అడగలేదని… హుందాగా ఉన్నారని పేర్కొన్నారు.  సురవరంను భవిష్యత్ తరాలు గుర్తించుకునేల కేసీఆర్ తో మాట్లాడి కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు.  తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ప్రాంత మహానుభావులను గౌరవించుకున్నామన్నారు.   ఇక్కడ నాలుగు యూనివర్సిటీలకు పివి, కాళోజీ, జయశంకర్, కొండ బాపూజీ పేర్లు పెట్టుకున్నామని.. ప్రతాప్ రెడ్డి పేరు కూడా ఒక యూనివర్సిటీ కి పెట్టాలన్న ప్రతిపాదన సముచితమని తెలిపారు. ఈ వినతిని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి… సానుకూల నిర్ణయం వచ్చేలా కలిసికట్టుగా ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. 

Related posts