telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన దేతడి హారిక…

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా బిగ్ బాస్ షో 4 విజేత అభిజిత్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు జూబ్లీహిల్స్ లోని పార్కులో మొక్కలు నాటిన దేతడి హారిక. ఈ సందర్భంగా హారిక మాట్లాడుతూ గతంలో కూడా నీను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటడం జరిగింది అని ఇప్పుడు 2వ సారి పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. పచ్చదనం పెంచడం కోసం వాతావరణ కాలుష్యం తగ్గించడం కోసం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి వారి గ్రూపు సభ్యులకు అభినందనలు తెలియజేయడం జరిగింది. ఈ చాలెంజ్ ఇదే విధంగా ముందుకు కొనసాగాలని అందులో భాగంగా నా మిత్రుడు నటుడు నోయెల్ సేన్, బిగ్ బాస్ 2 ఫేం దీప్తి సునైనా లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

Related posts