telugu navyamedia
సినిమా వార్తలు

“మహానాయకుడు”పై లక్ష్మీపార్వతి వ్యాఖ్యలు

Mahanayakudu

వెండితెర ఇలవేల్పుగా తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకొన్న గొప్ప సినీ, రాజకీయ నాయకుడు దివంగత నందమూరి తారకరామారావు. ఆ మహనీయుడి జీవితం ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్రలో ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కింది. తొలిభాగమైన “ఎన్టీఆర్ కథానాయకుడు” జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాగా, రెండవ భాగమైన “ఎన్టీఆర్ మహానాయకుడు” ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంపై లక్ష్మీపార్వతి స్పందించారు.

తాను సినిమా చూడలేదని, కానీ ఈ సినిమాను చూసినవారంతా ఇది బయోపిక్ లా లేదని అంటున్నారని, సినిమాలో చంద్రబాబు గొప్పతనమే చూపించారని అంటున్నారని, సినిమా ఇలా ఉంటుందన్న విషయం తనకు ముందే తెలుసునని అన్నారు లక్ష్మీపార్వతి. చంద్రబాబుతో అన్నివిధాలుగా లింకులు పెట్టుకున్న బాలకృష్ణ తన తండ్రికి జరిగిన ద్రోహాన్ని ఎలా చూపిస్తాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు లక్ష్మీపార్వతి. ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా తెరకెక్కినప్పటికీ ఎక్కడా తన ప్రస్తావన తీసుకురాలేదని, తన ప్రస్తావన ఎక్కడైనా తీసుకువస్తే ఎన్టీఆర్ కు జరిగిన అన్యాయాన్ని కూడా ప్రేక్షకులకు చూపించాల్సి వస్తుందని, ఆ ధైర్యం బాలకృష్ణకు లేదంటూ కామెంట్ చేశారు. అందుకే ఈ బయోపిక్ కు ప్రేక్షకులు కూడా సరైన తీర్పునే ఇచ్చారని, వర్మ “లక్ష్మీస్ ఎన్టీఆర్”లో వాస్తవాలు చూపించబోతున్నాడని, ప్రేక్షకులతో పాటు తాను కూడా ఆ చిత్రం విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు చెప్పుకొచ్చారు లక్ష్మీపార్వతి.

Related posts