కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న సినిమాలో రష్మిక హీరోయిన్ గా ఎంపిక చేసారు. తెలుగుచిత్ర సీమలో హిట్ సినిమాతో అరంగేట్రం చేసి వరుస విజయాలు అందుకుంది. తనదైన నటనతో అందరిని అలరించి లక్కీ బ్యూటీ బిరుదును సంపాదించింది. అయితే సిద్ధార్థ్ మల్హోత్రా నటిస్తున్న మిషన్ మజ్ను సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది ఈ భామ. ఈ సినిమా కోసం రష్మిక ప్రత్యేకంగా సిద్ధమైందట. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా రష్మిక పాత్రకు చాలా ప్రాధాన్యం ఉందట. ఈ నేపథ్యంలో ఈ భామ కొన్ని ఆన్‌లైన్ క్లాస్‌లకు కూడా వెళ్లిందట. తన పాత్రకు అవసరమైన అన్ని విషయాలను నేర్చుకుందట. ఒక ట్యూటర్‌ను పెట్టుకుని ప్రత్యేకంగా హిందీ కూడా నేర్చుకుంటోందట. అలాగే ముంబైలో ఓ ఫ్లాట్‌ను రష్మిక కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
previous post
కింద పడి మరీ నవ్వుకున్నా… “మన్మథుడు-2″పై అమల కామెంట్స్