telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కాబోయే భర్త ఫోటో పోస్ట్ చేసిన పునర్నవి

Punnu

బిగ్ బాస్ బ్యూటీ, నటి పునర్నవి భూపాలం తనకు పెళ్లి కుదిరినట్టు నిన్న సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే. ఈరోజు కూడా పునర్నవి తన ఎంగేజ్‌మెంట్ రింగ్ చూపిస్తూ కాబోయే భర్త ఫొటోను కూడా కాస్త బ్లర్ చేసి చూపించారు. ఈ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన పున్ను.. ‘‘నేను అవును అని చెప్పాల్సి వచ్చింది. ఉద్భత్ రఘునందన్, నేను మా బిగ్ డే గురించి రేపు చెబుతాం’’ అని పేర్కొన్నారు. ఇక రఘునందన్ అయితే పున్నుతో తీసుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘‘పునర్నవి యస్ చెప్పింది. చాలా ఆనందంగా ఉంది. ఆ బిగ్ డే గురించి రేపు మీకు చెప్పడానికి ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న’’ అని రఘునందన్ పేర్కొన్నారు. ఈ ఉద్భవ్ రఘునందన్ అసలు పేరు పృథ్వీరాజ్ సంపర. యూట్యూబ్‌లో ‘చికాగో సుబ్బారావు’ అనే ఛానెల్ లో తన షార్ట్ ఫిలింస్ పెడుతుంటారు. ఈ షార్ట్ ఫిలింస్‌కు దర్శకుడు, నిర్మాత కూడా ఆయనే. ఇప్పటి వరకు షార్ట్ ఫిలింస్ నటుడిగా ఉన్న ఈయన ఇప్పుడు వెబ్ సిరీస్ ఎంట్రీ ఇస్తున్నారు. కాగా ఈ ప్రకటనలు చూస్తుంటే ఎవరైనా వీళ్లకు నిజంగా నిశ్చితార్థం అయిపోయిందేమో, రేపు ప్రకటించబోయేది పెళ్లి తేదీనేమో అనే అనుకుంటారు. కానీ ఇది వాళ్లు నటించిన వెబ్ సిరీస్ ప్రచారం. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ‘ఆహా’ కోసం వీళ్లిద్దరూ ఒక వెబ్ సిరీస్‌లో నటించారు. ఇటీవలే వీరిద్దరూ డబ్బింగ్ కూడా పూర్తిచేశారు. హిందీ వెబ్ సిరీస్ ‘పర్మనెంట్ రూంమేట్స్’కు ఇది రీమేక్. ఈ వెబ్ సిరీస్ ప్రచారంలో భాగంగానే పున్ను ఈ ఎంగేజ్‌మెంట్ ప్లాన్ వాడుతున్నట్టు సమాచారం.

 

View this post on Instagram

 

@punarnavib She said yes🕺🏽 Naaaice 😍 Can’t wait to tell you all about the big day tomorrow 🌹

A post shared by Udbhav Raghunandan (@itsudbhav) on

Related posts