telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

దేశవ్యాప్తంగా .. అత్యవసర సేవలు కూడా నిలిపేసిన వైద్యులు…

doctors stopped emergency services also

వైద్యులు మరోసారి దేశ వ్యాప్త బందుకు పిలపునిచ్చారు. దీంతో.. రోగులు ఆస్పత్రుల మెట్లెక్కి వెనక్కి తిరుగుతున్నారు. ఎమర్జెన్సీ కేసులు తప్ప.. ఏ కేసులను వైద్యులు టేకప్ చేయడం లేదు. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి.. రేపు ఉదయం 6 గంటల వరకూ వైద్యులు బంద్‌ను కొనసాగించనున్నారు. బంద్‌కు ఐఎంఏ తెలుగు రాష్ట్రాల కమిటీలు, జూనియర్ వైద్యులు, ప్రైవేటు ఆస్పత్రులు మద్దతు తెలియజేస్తున్నాయి. దీంతో.. తెలుగు రాష్ట్రాల్లోనూ వైద్య సేవలకు అంతరాయం ఏర్పడనుంది. వైద్య సేవల నిలిపివేతతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది.

కేంద్ర ప్రభుత్వం తాజాగా.. తీసుకొచ్చిన ఎఎన్‌ఎంసీ బిల్లును వ్యతిరేకిస్తూ ఇప్పటికే ఆందోళన కొనసాగుతుండగా.. ఇవాళ అవి మరింత తీవ్రరూపం దాల్చాయి. ఈ బిల్లును నిరసిస్తూ 5 వేల మంది డాక్టర్లు, వైద్య విద్యార్థులు ఢిల్లీ వేదికగా సోమవారం నిరసనలు చేపట్టారు. కార్పొరేట్ ఆస్పత్రులకు మేలు చేసేందుకే కొత్త బిల్ల తీసుకొచ్చారని ఆరోపిస్తున్నారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల వ్యాప్తంగా కూడా.. ఈ బంద్ నడుస్తుంది. జిల్లాలా వారీగా.. మండలాల వారీగా డాక్టర్లు రోడ్డుపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. వైద్యులకు మద్దతుగా ప్రముఖ హీరో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా మద్దతు తెలిపారు. దీనిపై కేంద్రం వెంటనే మంచి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

Related posts