telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

గాంధీ ఆస్పత్రిలో రేపు టీకా వేసుకోనున్న మంత్రి ఈటల

హైదరాబాద్‌ కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి దేశవ్యాప్తంగా ఈ నెల 16 నుంచి టీకా పంపిణీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో 1,213 వ్యాక్సినేషన్‌ సెంటర్లను ఏర్పాటు చేసారు. అయితే.. ఇవాళ మంత్రి ఈటల వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందరర్భంగా ఆయన మాట్లాడారు. రేపు తెలంగాణ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మొదలుకానుందని… గాంధీ ఆస్పత్రిలో రేపు టీకా వేసుకుంటానని మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు.  గాంధీ ఆస్పత్రిలో తనతో పాటూ సీఎస్, హెల్త్ సెక్రటరీ అధికారులు పాల్గొంటారని తెలిపారు ఈటల. మొదట ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేసే శానిటేషన్ వర్కర్ల నుంచి పై స్థాయి దాకా టీకా వేస్తారన్నారు. ఇప్పుడు వచ్చిన డోసులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే వాళ్లకు రెండు డోసులకు సరిపోతాయని తెలిపారు. కేంద్రం రెండోసారి డోసులు పంపగానే, మిగతా వాళ్లకు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. వాక్సిన్ ను అన్ని రకాల పరీక్షలు జరిగాకే.. అనుమతులు ఇచ్చారని.. వాక్సిన్ పై అపోహలు వద్దని హామీ ఇచ్చారు ఈటల. మొదటి డోస్ ఏ కంపనిది ఇస్తే రెండో డోస్ అదే ఇవ్వాలని తెలిపారు.

Related posts