telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

థియేటర్‌లను నమ్ముకోలేక డిజిటల్‌లో అమ్ముకున్న ‘అమృతరామమ్’

a

రామ్ మిట్టకంటి, అమిత రంగనాథ్ హీరోహీరోయిన్లుగా కొత్త దర్శకుడు సురేందర్ కొంటాడి తెరకెక్కించిన చిత్రం ‘అమృతరామమ్’. పద్మజ ఫిలింస్, సినిమావాలా బ్యానర్లపై ఎస్.ఎన్.రెడ్డి నిర్మించారు. ఈ సినిమా షూటింగ్ మొత్తం ఆస్ట్రేలియాలోనే చేశారు. ఇప్పటి వరకు ప్రేమ కోసం పరితపించే అబ్బాయిల కథలను వెండితెరపై మనం చూశాం. అయితే, ఇది అలాంటి ఒకమ్మాయి ప్రేమకథ. ఇది ఒక చిన్న సినిమానే అయినా పెద్దపెద్ద వాళ్లను ఆకర్షించింది. నిర్మాత మధుర శ్రీధర్ ఈ సినిమా ఆడియో హక్కులను కొనుగోలు చేశారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డి.సురేష్ బాబు ఈ సినిమాను విడుదల చేయడానికి ముందుకొచ్చారు. స్టార్ హీరోల సినిమాలు సైతం విడుదలైన 30 రోజుల్లో ఓటీటీ ప్లాట్‌ఫాంలలో దర్శనమిస్తున్నాయి. ఈ లాక్‌డౌన్ పీరియడ్‌లో వీటికి ఆదరణ బాగా పెరిగింది. ఈ లాక్‌డౌన్ లేకపోయుంటే మార్చి 27న సినిమా విడుదలకావాల్సింది. ఇప్పుడు ఈ లాక్‌డౌన్ ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితి. అందుకే, ఇక థియేటర్‌లో విడుదల వరకు ఆగకూడదని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఈనెల 29న జీ5లో ‘అమృతరామమ్’ ప్రీమియర్ ప్రసారం కానుంది. జీ5లో ప్రీమియంను సబ్‌స్ర్కైబ్ చేసుకున్నవారు ఈ సినిమాను చూడొచ్చు.

Related posts