telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ సామాజిక

సరిహద్దులలో .. రంజాన్ వేడుకలు.. నోరు తీపి చేసుకున్న జవాన్లు..

ramzan celebration in indo-pak boarder

సరిహద్దుల్లో భారత్‌, పాక్‌ జవాన్లు రంజాన్‌ మాసం చివరి రోజును పురస్కరించుకుని మిఠాయిలు పంచుకున్నారు. పంజాబ్‌లోని అట్టారీ-వాఘా సరిహద్దుల్లో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. భారత్‌కు చెందిన సరిహద్దు భద్రతా సిబ్బంది (బీఎస్‌ఎఫ్‌), పాక్ రేంజర్లు ఒకరికొకరు స్వీట్లు పంచుకున్నారు.

పాక్ వింగ్‌ కమాండర్‌ ఉస్మాన్‌ అలీ.. భారత బీఎస్‌ఎఫ్‌ కమాండెంట్‌ ముకుంద్‌ కుమార్‌ ఝా కు స్వీట్లు అందజేశారు. అనంతరం ఇరువురు కరచాలనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. ఇరు దేశాల జాతీయ, మతపరమైన పండగల సందర్భంగా రెండు దేశాలకు చెందిన జవాన్లు ఇలా స్వీట్లు పంచుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ప్రధానిగా నరేంద్రమోదీ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇలా మిఠాయిలు పంచుకోవడం ఇదే ప్రథమం.

Related posts