telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

రెండు కాలనీల మధ్య వివాదానికి కారణమైన వాన నీరు…

తెలంగాణను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే వర్షాల కారణంగా రెండు రాష్ట్రాల్లోనూ నదులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఇక హైదరాబాద్ నగరంలో కుండపోతగా వర్షాలు కురుస్తుండటంతో నగరంలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఎక్కడికక్కడ వర్షపు నీరు రోడ్ల పైనే నిలిచిపోయింది. అయితే ఇప్పుడు ఆ వాననీరు రెండు కాలనీల మధ్య వివాదానికి కారణమైంది. బడంగ్ పేట్ లో వర్షపు నీరు భారీగా నిలిచిపోవడంతో ఆ నీటి వరద పోయేందుకు గండి కొట్టారు అధికారులు. అప్పుడు అక్కడికి బడంగ్ పేట్ , మీర్పేట్ జనప్రియ కాలనీల వాసులు భారీగా మోహరింపు అయ్యారు. దాంతో మీర్పేట్ లో కాలనీ వాసుల ఆందోళన మొదలు పెట్టారు. అధికారులను అడ్డుకొని గండి పూడ్చుతున్నారు జనప్రియ కాలనీ వాసులు. ఆ కారణంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. స్థానిక నేతలు, కార్పోరేటర్స్, స్థానికులు భారీగా అక్కడ మోహరింపు కావడంతో మీర్పేట్ పోలీసుల రంగప్రవేశం సర్ధిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తెలంగాణలో కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.

Related posts