telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు సామాజిక

వామ్మో.. మొదటి రోజే… 69 వేలమందా.. ఇక మిగిలిన ఏడాదిలో…

births on first day of 2019

ఆంగ్ల సంవత్సరాది మొదటి రోజుకు ప్రాధాన్యత బాగానే ఉంటుంది. దీనితో ఆరోజు నుండి చాలా మంది తమ పనులను ప్రారంభించాలని కూడా తీర్మానాలు చేసుకుంటుంటారు. అందులో భాగంగానే, ఆరోజు పుట్టుకలు కూడా. ప్రపంచ వ్యాప్తంగా ఈ తేదీకున్న ప్రాముఖ్యత ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. నూతన సంవత్సరంకి తొలి రోజు కావడంతో దానికి ఎంతో ప్రాధాన్యత. తమ కొత్త పనులకి ఆ రోజే శ్రీకారం చుట్టాలని చాలా మంది భావిస్తారు. అలాగే తమ బిడ్డ ఆ రోజే ఈ భూమిపైకి రావాలని నెలలు నిండిన పలువురు గర్భిణులు కూడా కోరుకుంటారు. ఆ విధంగా ఈ ఏడాది జనవరి ఒకటిన పుట్టిన పిల్లల విషయానికి వస్తే, ప్రపంచ వ్యాప్తంగా సుమారు 3,95,000 మంది పిల్లలు ఆ రోజున అమ్మ కడుపు నుంచి ఈ భూమ్మీదకు వచ్చి కళ్లు తెరిచారు.

ఇందులో మాత్రం ఎప్పటి లాగానే అగ్రతాంబూలం ఇండియాదే. భారత్ లో 69,944 మంది నిన్న జన్మించినట్టు నమోదు అయిందట. ఇక భారత్ తర్వాత చైనాలో 44,940, నైజీరియాలో 25,685, పాకిస్థాన్ లో 15,112, ఇండోనేషియాలో 13,256, అమెరికాలో 11,086, కాంగోలో 10,053, బంగ్లాదేశ్ లో 8428 మంది బేబీలు జన్మించినట్టు అధికారికంగా నమోదయింది. ఇక 2019 ప్రవేశిస్తున్న తొలి క్షణాలలో జననాలు ఫిజీలో నమోదైతే, చివరి క్షణాల నమోదు అమెరికాలో జరిగింది. ఐక్య రాజ్యసమితికి చెందిన యునిసెఫ్ ఈ గణాంకాలను ప్రకటించింది.

Related posts