స్థానికంగా టీడీపీ నేత దారుణ హత్య కలకలం రేపింది. పట్టణంలోని ఇందిరా నగర్ నాలుగో వార్డులో నివాసముండే తాడిబోయిన ఉమా యాదవ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కత్తులతో పొడిచి హత్య చేశారు. మృతుడి ఇంటికి సమీపంలోనే ఈ ఘటన జరిగింది. ముగ్గురు దుండగులు కత్తులతో వచ్చి హత్యచేసి వెళ్లారని స్థానికులు చెబుతున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకీ వచ్చింది ఎవరు ? ఎందుకు హత్య చేశారు ? ఏమైనా రాజకీయ కక్షలా ? లేదా వ్యక్తిగత కక్షలా ? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు .
దుండగుల దాడిలో మృతి చెందిన ఉమా యాదవ్ గతంలో జరిగిన ఓ హత్యకేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఎన్నికల సమయంలో మంగళగిరిలో కీలక నేతగా వ్యవహరించిన ఉమా యాదవ్ హత్యకు గురికావటం పట్ల టీడీపీ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. గత ఎన్నికల్లో మంగళగిరి నుండి ఎన్నికల బరిలోకి దిగిన నారా లోకేష్ గెలవాలని ఉమా యాదవ్ ప్రచారం నిర్వహించారు. మంగళగిరి పట్టణంలో ఆయన కీలకంగా వ్యవహరించారు.