తెలంగాణలోని సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం పిక్లానాయక్ తండాకు చెందిన యువతి అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపుతోంది. ఆమెపై అత్యాచారం జరిగిందని వైద్యులు చెప్పడంతో విషయం బయటకు వచ్చింది. నిజానికి నల్గొండ గురుకుల కళాశాలలో డిగ్రీ చదువుతున్న యువతి పీజీ కోచింగ్ కోసమని తండా నుంచి గురువారం హైదరాబాద్‌కు వచ్చింది. అయితే తనకు ఆరోగ్యం బాగోలేదంటూ ఆ మరుసటి రోజే తల్లిదండ్రులకు ఫోన్ చేసి తెలిపింది యువతి. వెంటనే హైదరాబాద్ వెళ్ళిన తల్లితండ్రులు ఆమెను మొదట ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్పించారు. అయితే యువతిపై అత్యాచారం జరిగిందని, మెరుగైన చికిత్సకు హైదరాబాద్ వెళ్లాల్సిందేనని అక్కడి వైద్యులు చెప్పడంతో యువతిని హైదరాబాద్‌కు తరలిస్తుండగా ఆమె మార్గ మధ్యలోనే చనిపోయింది. దీంతో కోదాడ ప్రభుత్వాసుపత్రిలో యువతి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అయితే తమకు న్యాయం జరిగేంత వరకు మృతదేహాన్ని తీసుకెళ్లేది లేదని మృతురాలి బంధువులు ఆసుపత్రి దగ్గరే బైటాయించారు. దీంతో యువతి మృతదేహం కోదాడ మర్చురీలోనే ఉండిపోయింది. పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
previous post
ఇచ్చిన హామీని కేంద్రం నిలబెట్టుకోవాలి: కేటీఆర్