telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

గుడివాడలో ఇళ్లు ఇవ్వకపోతే.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను

గుడివాడలో 17 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు, ఇల్లు ఇస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గుడివాడలో 17 వేల మంది పేదలకు ఇళ్లు ఇవ్వకపోతే.. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేయబోనని ఆయన తెలిపారు. తనపై కావాలనే టీడీపీకి చెందిన మీడియా అవినీతికి పాల్పడినట్టు తప్పుడు వార్తలు రాస్తుందని ఫైర్‌ అయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఐదేళ్లలో ప్రజల కోసం చేసిందేమీ లేదని.. అందుకే ప్రజా సంక్షేమానికై పాటుపడుతున్న ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీపై చంద్రబాబే తప్పుడు ప్రచారం చేయిస్తున్నాడని.. వెన్నుపోటుకు మారుపేరైన బాబు మాటలు ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. గుడివాడ గడ్డపై నాలుగు సార్లు ఎమ్మెల్యేగా తాను ఎన్నికయ్యానని.. ఇక్కడ ఇళ్లు లేని పేదలు ఎంతో మంది ఉన్నారని తెలిపారు. చంద్రబాబు ఎన్నికల ముందు హడావుడిగా శంఖుస్థాపన చేశారని.. అంతేతప్ప వీటి గురించి పెద్దగా పట్టించుకోలేదన్నారు. అందుకే అర్హులందరికీ లబ్ది చేకూర్చాలనే ఉద్దేశంతో ఇళ్ల స్థలాల కోసం 94 కోట్ల తో 181 ఎకరాలు తీసుకున్నామని పేర్కొన్నారు. 8 వేల మంది సెంటు స్థలం ఇస్తామని.. టిడ్కో లబ్ధిదారుల దగ్గర చంద్రబాబు డబ్బుల అన్యాయంగా కట్టించుకున్నారని ఫైర్‌ అయ్యారు. చంద్రబాబు అనవసరంగా వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలుచేస్తున్నారని పేర్కొన్నారు.

Related posts