telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

నేటి నుంచి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

Telangana assembly hyd

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచే ప్రారంభంకానున్నాయి. ఉదయం 11 గంటలకు సంప్రదాయం ప్రకారం గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ ప్రసంగించనున్నారు. 2021-2022 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ ను ఆమోదించేందుకు శాసన సభ ,శాసన మండలి సమావేశం కానున్నాయి. తొలిరోజు సమావేశం కేవలం గవర్నర్ ప్రసంగానికి పరిమితం కానుండగా… అనంతరం సమావేశం కానున్నాయి ఉభయసభల బిఎసి కమిటీలు. బిఏసి కమిటీ మీటింగ్ లో బడ్జెట్ సమావేశాల ఎజెండాను ఖరారు చేయనున్నారు. దాదాపు 12 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది. ఈనెల 16న దివంగత సభ్యులకు సంతాపం తెలిపే తీర్మానాలు ఉన్నాయి. 17న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ప్రభుత్వం సమాధానం చెప్పే అవకాశం ఉంది. 18వ తేదీన 2021-2022 ఆర్థిక సంవత్సరానికి ఉదయ సభల్లో వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీ సమావేశాలకు వచ్చే సభ్యులు, మీడియా సిబ్బంది పోలీసులు తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. రోజుకు రెండుసార్లు అసెంబ్లీ మండలి ప్రాంగణాలను సానిటైజేషన్ చేయనున్నారు. ఈసారి సమావేశాల్లో కూడా విజిటర్స్ కు అనుమతి ఇవ్వడం లేదు. గత సమవేశాల్లో కాగ్ రిపోర్టు ప్రవేశ పెట్టని కారణంగా ఈసారి రెండు రిపోర్టులు ప్రవేశ పెట్టనున్నారు.

Related posts