telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“వకీల్ సాబ్” షూటింగ్ స్టార్ట్ చేయనున్న పవన్ ?

Vakeel-Saab

పవన్ కల్యాణ్ కథానాయకుడిగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ రూపొందుతోంది. ఈ సినిమాను దిల్ రాజు, బోని కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పవన్‌ సరసన శ్రుతీ హాసన్ నటిస్తోంది. నివేథా థామస్, అంజలి, అనన్య కీలక పాత్రల్లో కనిపించనున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీపై పవన్‌ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. హిందీలో హిట్టయిన ‘పింక్’ సినిమా ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఇంకా కాస్త బ్యాలన్స్ షూట్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో షూటింగ్స్ తిరిగి మొదలు కావడంతో వకీల్ సాబ్ యూనిట్ కూడా మొదలు పెట్టారు. ముందు పవన్ లేని షాట్స్ ను తీసేసి పవన్ రాక కోసం ఎదురు చూసారు. అయితే ఇప్పుడు పవన్ ఎంట్రీకి రంగం సిద్ధం అయ్యినట్టు తెలుస్తుంది. ఈ నవంబర్ 1 నుంచి షూట్ లో పాల్గొనేందుకు ఈ వకీల్ సాబ్ టైం ను ఫిక్స్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ నుంచి పవన్ పై మిగిలి ఉన్న కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.

Related posts