telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మే 1 నుంచి 18 ఏళ్లుపై బడిన వారికి వ్యాక్సిన్ : కేంద్రం కొత్త మార్గదర్శకాలు

Corona Virus Vaccine

దేశంలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ ప్రక్రియను వేగవంతం చేసింది కేంద్రం. ఇందులో బాగంగానే కోవిన్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మే 1 నుంచి వ్యాక్సినేషన్ అందించనున్నారు. ఇప్పటికే దేశంలో 45 ఏళ్ళు నిండిన వారికి వ్యాక్సిన్ ఫ్రీగా అందిస్తున్నారు. అయితే, 18 ఏళ్ళు నిండిన వారికి మే 1 నుంచి వ్యాక్సిన్ అందించబోతున్నారు.ఈ తరుణంలో వ్యాక్సిన్ ప్రక్రియ సజావుగా జరగడానికి రాష్ట్రాలు, కేంద్ర ప్రాంత ప్రాంతాలకు కేంద్రం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.
మార్గదర్శకాలు :
ప్రైవేట్ ఆస్పత్రులు, పరిశ్రమలకు చెందిన ఆస్పత్రులు తదితర వాటి సహకారంతో అదనపు ప్రైవేట్ వ్యాక్సిన్ కేంద్రాలను రిజిస్టర్ చేయాలి.

ఏయే ఆస్పత్రులు ఎన్ని వ్యాక్సిన్లు కొనుగోలు చేశాయి. టీకా నిల్వలు, ధరలను కోవిన్ యాప్ లో నమోదు చేయాలి.

కోవిన్ లో వ్యాక్సిన్ స్లాట్ లను అందుబాటులో ఉంచుతూ అర్హులైన వారికి టీకాలు వేయాలి.

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాలు నేరుగా వ్యాక్సిన్లు కొనుగోలు నిర్ణయానికి ప్రాధాన్యమివ్వాలి.

18-45 ఏళ్ల వయసు గ్రూప్ వారికి కేవలం “ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ” మాత్రమే అన్న విషయం ప్రచారం చేయాలి.

టీకా కేంద్రాల వద్ద రద్దీ ఉండకుండా చూసే అధికారులకు పూర్తి సహకారం అందించాలి.

Related posts