telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

ఖతాదారులకు అలర్ట్‌ : ఇవాళ, రేపు బ్యాంకులు బంద్‌

bank strike

దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ ప్రభుత్వం బ్యాంకుల ఉద్యోగులు ఇవాళ, రేపు సమ్మె చేయనున్నారు. దీంతో రెండు రోజుల పాటు బ్యాంకు సేవలకు అంతరాయం ఏర్పడనుంది. యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ ఈ దేశ వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. ఇందులో 9 యూనియన్లు ఉన్నాయి. సమ్మెలో 10 లక్షల మంది ఉద్యోగులు పాల్గొననున్నారు. ఇటీవల బడ్జెట్‌ సమావేశాల్లో ఐడీబీఐ సహా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటనతో బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగారు. దీంతో ఇవాళ, రేపు బ్యాంకింగ్‌ సేవలకు అంతరాయం కలుగనుంది. హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌, యాక్సిస్‌, ఐసీఐసీఐ, కోటక్‌ మహీంద్రా లాంటి ప్రైవేటు బ్యాంకులు మాత్రం యథాతథంగా పనిచేస్తాయి. ప్రైవేట్‌ బ్యాంకులపై ఈ సమ్మె ప్రభావం లేదు.

Related posts