బీజేపీ , కాంగ్రెస్ దొందూ దొందేనని తెలంగాణ మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి జిల్లా కంది మండలం కాంగ్రెస్ సీనియర్ నేత రామ కృష్ణా రెడ్డి, సర్పంచి విమల వీరేశం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. . ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్, బీజేపీలకు స్థానంలేదన్నారు.
రానున్న మున్సిపల్ ఎన్నికల్లోసంగారెడ్డి లోని ఎనిమిది మున్సిపాలిటీలు క్లీన్ స్వీప్ చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణ అభివృద్ధి టీఆర్ఎస్, కేసీఆర్ వల్లేసాధ్యమని చెప్పారు. దేశానికి తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్ గా నిలిచిందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు తెలంగాణ అభివృద్ధిని చూసివెళ్తున్నాయన్నారు. కాళేశ్వరం మెగా ప్రాజెక్టును దేశమంతా చూస్తోందని పేర్కొన్నారు.