తెలంగాణ ఆర్థికమంత్రి హరీశ్‌రావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. మంగళవారం నాంపల్లిలో మానవహక్కుల కమిషన్(హెచ్చార్సీ) చైర్మన్ జస్టిస్ చంద్రయ్యకు ఆ సంఘం అధ్యక్షుడు రాములు ఫిర్యాదు చేశారు.
సంగారెడ్డిలో మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం సందర్భంగా ఓ ఫోన్ సంభాషణలో బహిరంగంగా మంత్రి హరీశ్‌రావును దుర్భాషలాడారని, దీనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. దీనికి సంబంధించిన వీడియోసీడీలను సమర్పించారు. ఎమ్మెల్యేగా ఉండి చట్టాలకు, మానవ హక్కులకు వ్యతిరేకంగా మాట్లాడిన జగ్గారెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని కోరారు.