telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు విద్యా వార్తలు

దక్షిణ మధ్య రైల్వే లో … అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ …

apprentice jobs in south central railways

దక్షిణ మధ్య రైల్వే స్కిల్ ఇండియా ప్రోగ్రామ్‌లో భాగంగా అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతితోపాటు సంబంధిత విభాగంలో ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలుపుతున్నారు. ఇకపోతే ఉద్యోగాలకు సంబంధించిన వివరాలను తెలుసుకుంటే. ఏసీ మెకానిక్‌ 249, కార్పెంటర్ 16, డీజిల్ మెకానిక్‌ 640, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్‌ 18. ఎలక్ట్రీషియన్ 871. ఎలక్ట్రానిక్ మెకానిక్‌ 102. ఫిట్టర్‌ 1460. మెషినిస్ట్ 74. ఎఎండబ్ల్యూ 24. ఎంఎంటీఎం 12. పెయింటర్‌ 40. వెల్డర్ 597. ఇకపోతే ఈ ఉద్యోగాలకు గాను 50 శాతం మార్కులతో పదోతరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి.

ఈ ఉద్యోగానికి నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కూడా కలిగి ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితి 08.12.2019 నాటికి 15-24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇందులో సడలింపులు వర్తిస్తాయి. ఇక అభ్యర్దులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అకడమిక్ మెరిట్, మెడికల్ ఫిట్‌నెస్‌, ఫిజికల్ స్టాండర్డ్స్‌ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. దరఖాస్తు ఫీజు రూ.100. ఇందులో ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ఇక 09.11.2019. నుండి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవుతుండగా, 08.12.2019. వరకు దరఖాస్తులకు చివరితేదిగా ప్రకటించారు… ఇంకెందుకు ఆలస్యం రైల్చేలో ఉద్యోగాలు కావలనుకుంటున్న వారు ఒకసారి ప్రయత్నించడి.

Related posts