telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ట్రంప్ కొడుక్కి కరోనా పాజిటివ్..

చైనాలో పుట్టిన క‌రోనా వైర‌స్ ఎవరినీ వదలడం లేదు. సాధార‌ణ ప్ర‌జ‌లు అయినా స‌రే.. ప్ర‌ధాని అయినా స‌రే.. ప్ర‌జాప్ర‌తినిధి అయినా స‌రే.. అధికారి అయినా స‌రే దానికి మాత్రం ఏ మాత్రం వివ‌క్షలేదు.. అదును దొరికితేచాలు ఎటాక్ చేస్తోంది.. ఇప్ప‌టికే ఎంతోమంది ప్ర‌జాప్ర‌తినిధులు క‌రోనాబారిన ప‌డ్డారు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కుటుంబాన్ని కరోనా వైరస్‌ ఇప్పట్లో వదిలేలా లేదు. ఎన్నికలకు 20 రోజుల ముందు ట్రంప్‌తో పాటు ఆయన సతీమణి మెలానియా ట్రంప్‌ కరోనా బారిన పడగా… తాజాగా ఆయన పెద్ద కొడుకు జూనియర్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ వారం ప్రారంభంలో నిర్వహించిన కరోనా పరీక్షల్లో జూనియర్‌ ట్రంప్‌కు పాజిటివ్‌ వచ్చిందని అధికారులు తెలిపారు. ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఆయన క్వారంటైన్‌లో ఉన్నారని పేర్కొన్నారు. జూనియర్‌ ట్రంప్‌కు ఎలాంటి లక్షణాలు లేవని… కరోనా నిబంధనల ప్రకారం.. చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు. కాగా.. అమెరికాలో ఇప్పటి వరకు 1, 22, 68, 678 కరోనా కేసులు నమోదవగా.. 2,60, 235 మంది మృతి చెందారు.

Related posts