telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పోలీస్ అంటున్న.. సమంతా చైతు..

samantha-and-Nagachaitanya

నాగచైతన్య తాజాగా ‘మజిలీ’ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా తన కెరియర్లోనే భారీ వసూళ్లను రాబట్టడంతో ఆయన ఫుల్ జోష్ తో వున్నాడు. ఒక వైపున ‘వెంకీమామ’ షూటింగులో పాల్గొంటూనే, మరో వైపున ఆ తరువాత ప్రాజెక్టును పట్టాలెక్కించే పనులు చూసుకుంటున్నాడు.

ఆయన ‘ఆర్ ఎక్స్ 100’ దర్శకుడు అజయ్ భూపతితో ఒక సినిమా చేయనున్నాడనే వార్త ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. ఈ సినిమాకి ‘మహాసముద్రం’ అనే టైటిల్ ను కూడా ఖరారు చేశారని చెప్పుకుంటున్నారు. సముద్రం నేపథ్యంలో జరిగే మాఫియా కార్యకలాపాలకు సంబంధించిన కథతో ఈ సినిమా ఉంటుందనీ, ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా చైతూ కనిపిస్తాడని చెబుతున్నారు. ఇక ఈ సినిమాలోను ఆయన సరసన సమంతను ఒప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు.

Related posts