telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

అమెరికా హెచ్చరికను.. పట్టించుకోని చైనా, ..మసూద్ కే ఓటు..!

jaishe mahammad masud ajahar declared as international terrorist

ఎప్పటి నుండో భారత్ జైషే మహ్మద్ అధినేత మసూద్ అజర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి విజ్ఞప్తి చేస్తూనే ఉంది. కానీ దీనికి ప్రతిసారి చైనా కాళ్ళు అడ్డుపెడుతూనే ఉంది. దీనిపై ఈసారి కూడా భారత్ మరోమారు విజ్ఞప్తి చేసింది. దానికి మద్దతుగా అమెరికా, ఫ్రాన్స్, తదితర దేశాలు ఓటు వేశాయి. చైనాకు కూడా అమెరికా గట్టి హెచ్చరిక జారీచేసింది కూడా. కానీ, లక్ష్యపెట్టని చైనా మసూద్ కే ఓటు వేసింది.

ఇటీవల జరిగిన పుల్వామా ఘటన కు మసూద్ ప్రత్యక్షంగా సహకరించిందని తెలిసినా, అమెరికా హెచ్చరించినా చైనా తన తీరును మార్చుకోకుండా ఒక తీవ్రవాద సంస్థకు మద్దతు పలుకుతుందంటే, ఆ దేశం సదరు సంస్థకు నిధులు ఏ స్థాయిలో ఇస్తుందో ప్రపంచదేశాలు గ్రహించాల్సిన సందర్భంగా ఐక్యరాజ్యసమితి రక్షణ మండలి కూడా అర్ధం చేసుకోలేకపోతుందా.. లేక అమెరికా వీరందని వెనుక ఉంది నాటకాలు ఆడుతోందా.. ? ఎన్ని జరిగినా భారత్ కూడా తన ద్రుష్టి కోణం మార్చుకోకుండా, మళ్ళీ శాంతి అంటూ రక్షణ కూడా రాజకీయాలకు ఉపయోగించుకుంటుంది. దీనితో దేశంలో దాడులు సహజం అని మరోసారి ప్రపంచ స్థాయిలో రుజువయింది.

40 మంది జవాన్లు చనిపోయారు అనగానే భారతదేశం అంతా స్పందించింది, కానీ, ఎప్పటిలాగానే రెండు రోజులలో ఆ వేడి అంతా చల్లబడి, మళ్ళీ ఎవరి పనులలో వాళ్ళు పడిపోయారు. ఐక్యరాజ్యసమితి రక్షణ మండలికి కూడా దేశప్రజలు సామజిక మాధ్యమాల ద్వారా సూచనలు చేసితీరాలి. లేదంటే, భారత రక్షణ వ్యవస్థకు తీవ్రవాదాన్ని అణిచివేయాలని ఆదేశాలు ఇవ్వాలి. ఈ రెండిటిలో ఏదో ఒకటి జరిగితేనే, ప్రపంచం ముందు భారత్ ఒక దేశంలా నిలబడగలదు, లేదంటే, తీవ్రవాదులు దీపావళి జరుపుకొనే ఒక ప్రాంతంలా భవిష్యత్తులేని ప్రాంతంగా నిలబడిపోతుంది. ఏది కావాలో పౌరులే తేల్చుకోవాల్సి ఉంటుంది.

Related posts