telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే డాక్టర్లకు కరోనా: డీకే అరుణ

dk-aruna

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే డాక్టర్లకు కరోనా సోకుతోందని బీజేపీ నేత డీకే అరుణ అన్నారు. ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ ఒక్క ఆసుపత్రిలో కూడా కరోనా చికిత్సకు సరైన సదుపాయాలు లేవన్నారు. దేశంలోనే నెంబర్ వన్ అని చెప్పుకునే రాష్ట్రంలో కరోనా టెస్ట్‌లు చేయడంలో పూర్తిగా వెనకబడిందని అన్నారు.

రాష్ట్రంలో డాక్టర్ల ప్రాణాలకే ప్రభుత్వం భరోసా ఇవ్వలేకపోతోందన్నారు. దేశంలోనే కరోనా టెస్టుల్లో అత్యంత వెనుకబడిన రాష్ట్రం తెలంగాణ అని ఆమె ఆరోపించారు. కరోనా నుంచి ప్రజలను కాపాడుతున్న డాక్టర్లు, నర్సులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లకు పీపీఈ కిట్స్, మాస్కులు అందుబాటులో లేవని అరుణ చెప్పుకొచ్చారు. పరీక్షలు చేయటం, పీపీఈ, మాస్కులు ఇవ్వటంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

Related posts