తెలంగాణలో అక్టోబర్ 21న హుజుర్ నగర్ అసెంబ్లీకీ ఉప ఎన్నిక జరగనుంది. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ లు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. కాంగ్రెస్ కంచుకోట అయిన హుజుర్ నగర్‌లో జెండా పాతి తీరాల్సిందేనని టీఆర్ఎస్ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి జోరుగా దూసుకెళ్తున్నారు. అయితే కంచుకోటలో మళ్లీ జెండా ఎగరేయాలని కాంగ్రెస్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
టీడీపీ సైతం ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. గత రెండ్రోజులుగా తెలంగాణ టీడీపీ నేతలతో నిశితంగా చర్చించిన ఆ పార్టీ అధినేత చంద్రబాబు హుజూర్ నగర్‌లో పోటీకే మెగ్గు చూపుతున్నారు. నేడు హైదరాబాద్‌కు చంద్రబాబు రానున్నారు. మధ్యహాన్నం 3గంటలకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీటీడీపీ నేతలతో సమావేశమై హుజుర్ నగర్ అభ్యర్థిని ఖరారు చేయనున్నారు.