telugu navyamedia
రాజకీయ వార్తలు

ఉధృతమవుతున్న రైతుల ఆందోళన…

కేంద్ర మంత్రులు,రైతు సంఘాల నేతల మధ్య జరిగిన  చర్చలు విఫలం కావడంతో, రేపు మరోసారి జరిగే చర్చల్లో అనుసరించాల్సిన వ్యూహం పై ఢిల్లీ సరిహద్దుల్లోనే  సమావేశమై రైతు సంఘాల నేతలు సమాలోచనలు చేస్తున్నారు. మరో వైపు అమిత్ షా నివాసంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, కేంద్ర వినియోగదారులు, ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్  సమావేశం అయ్యారు.  ప్రతిష్టంభనను తొలగించేందుకు ఉన్న పరిష్కార మార్గాల పై కేంద్ర మంత్రుల సమాలోచనలు చేస్తున్నారు. ఢిల్లీ ప్రవేశ రహదారుల దిగ్బంధం చేశారు. ఉన్న కొద్ది రైతుల సంఖ్య పెరుగుతూ పోతుంది. చర్చలు విఫలం కావడంతో రైతు సంఘాలు మరింత సంఘటిత మయ్యాయి. ఆందోళన  ఉధృతం చేయాలనే యోచనలో రైతు సంఘాలు ఉన్నట్లు తెలుస్తోంది. మోడీ ప్రభుత్వం మనసు మార్చుకుని, రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే మూడు కొత్త వ్యవసాయ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతుల సహనాన్ని, బలహీనతగా తీసుకోవద్దని రైతు సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

Related posts