telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మోదీ స‌ర్కార్‌ కు ఎదురుదెబ్బ..సీబీఐ కేసులో సంచ‌ల‌న తీర్పు

SC Judgment On CBI Alok Verma |

సీబీఐ కేసులో మోదీ స‌ర్కార్‌ కు ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం విచారించి సీబీఐ చీఫ్‌గా అలోక్ వ‌ర్మను నియమించాలని సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పును వెలువ‌రించింది. కేంద్ర ప్రభుత్వ తీరును సుప్రీం కోర్ట్ తప్పుపట్టింది. అలోక్‌ వర్మను బలవంతంగా సెలవుపై పంపలేరని, సీబీఐ డైరెక్టర్‌గా తిరిగి నియమించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ వర్సెస్‌ సీబీఐ కేసులో సుప్రీంకోర్టు విచారిస్తూ కేంద్ర ప్రభుత్వ చర్యను తీవ్రంగా తప్పుపట్టింది.

సీబీఐ అనేది స్వయం ప్రతిపత్తిగల వ్యవస్థ అని, స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఉన్నందున రాజకీయ పక్షాలు జోక్యం చేసుకోకూడదని న్యాయస్థానం తీర్పును వెలువరించింది. అలోక్‌ వర్మపై ఆరోపణలు ఉన్నందున హైపవర్‌ కమిటీ విచారణ పూర్తి అయ్యే వరకు ఆయన ఎలాంటి విధాన పరమైన నిర్ణయాలు తీసుకోకూడదని సుప్రీం పేర్కొంది.

Related posts