telugu navyamedia
తెలంగాణ వార్తలు

స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా పాజిటివ్..

తెలంగాణ అసెంబ్లీ స్పీక‌ర్‌ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా తేలింది. రెగ్యులర్ మెడికల్ టెస్టుల్లో భాగంగా నిన్న చేయించిన పరీక్షల్లో ఆయనకు కొవిడ్ పాజిటివ్ ఉన్నట్టు తెలిసింది. ప్రస్తుతం నాకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. డాక్టర్ల సూచనల మేరకు గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్ లో చేరాను అని పోచారం తెలిపారు.

COVID-19 test mandatory for entry into Telangana State Assembly - The Hindu

మూడు రోజుల క్రితం ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కే చంద్రశేఖర్ రావు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర అధికారులు హాజరైన తన మనవరాలి పెళ్లిలో స్పీకర్ పాల్గొన్నారు. వివాహానికి హాజరైన వారు, సన్నిహితంగా ఉన్నవారు కొవిడ్ టెస్ట్ చేయించుకోవాలని, జాగ్రత్తలతో హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని ఆయన కోరారు.

Pics: KCR, Jagan Meet Finally -

దేశంలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టిన త‌రుణంలో మ‌ళ్ళీ కొంత‌మంది సినీ రాజ‌కీయ ప్ర‌ముఖులు ఆస్ప‌త్రిలో చేర‌డం ఆందోళ‌న క‌లిగిస్తుంది. ఇటీవల క‌మ‌ల్ హాస‌న్‌, ప్ర‌ముఖ డాన్స‌ర్ శివ‌కుమార్ మాస్ట‌ర్‌, ఇప్ప‌డు పోచారం…ఏది ఏమైనా అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండ‌డం ఉత్త‌మం.

Related posts