ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. ఆమెతో పాటు ఏపీ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి, రిటైర్డ్ అధికారులకు సమన్లు జారీ అయ్యాయి.
ఈ కేసులో భాగంగా పెన్నా సిమెంట్స్ కు భూముల కేటాయింపు వ్యవహారంలో అవకతవకల విషయమై దాఖలైన అనుబంధ ఛార్జిషీట్ ను సీబీఐ న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా రిటైర్డ్ అధికారులు శామ్యూల్, వీడీ రాజగోపాల్, డీఆర్వో సుదర్శన్ రెడ్డి, తహశీల్దార్ ఎల్లమ్మకు సమన్లు జారీ చేసింది. ఈ కేసు విచారణ నిమిత్తం ఈ నెల 17న నిందితులు హాజరు కావాలని ఆదేశించింది.
ఫలితాల రోజే కూటమి సమావేశం: చంద్రబాబు