telugu navyamedia
రాజకీయ వార్తలు

రెబల్ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు: అవినాశ్ పాండే

Rajasthan Avinahs pande

రాజస్థాన్‌ లో రాజకీయ ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. తాజా పరిస్థితులపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ అవినాశ్ పాండే స్పందించారు. ప్రజాస్వామ్య పద్ధతుల ద్వారా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ ప్రతిష్ఠంభనను పరిష్కరిస్తామన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి పైలట్ వర్గంలోని 19 మంది రెబల్ ఎమ్మెల్యేలలో చాలామంది తమతో టచ్‌లో ఉన్నారని అన్నారు. తమతో సంప్రదింపులు జరుపుతున్నారని పేర్కొన్నారు.

సమస్య పరిష్కారం కోసం ప్రజాస్వామ్యంలో ఉన్న అన్ని గాంధేయ, శాంతియుత పద్ధతులను ఉపయోస్తామని స్పష్టం చేశారు. అసెంబ్లీని సమావేశ పరచాలని గెహ్లాట్ ప్రభుత్వం కోరుతున్నప్పటికీ గవర్నర్ కల్రాజ్ మిశ్రా స్పందించడం లేదని పాండే అన్నారు. తమకు బలమున్నప్పటికీ అసెంబ్లీని సమావేశపరచకుండా గవర్నర్ మోకాలడ్డడం గత 70 ఏళ్లలో ఎన్నడూ జరగలేదని అన్నారు. అవసరమనుకుంటే సీఎం గెహ్లాట్ ప్రజాప్రతినిధులందరితో కలిసి రాష్ట్రపతిని కలుస్తారని అన్నారు.

Related posts