ఈ నెల 11వ తేదీ నుంచి తిరుమల శ్రీవారి సాధారణ భక్తులను అనుమతించనున్నారు. ఇందుకోసం టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దూరప్రాంతాల నుంచి భక్తులెవరూ తొందరపడి తిరుమలకు రావొద్దని టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ సూచించారు. ముందే ఆన్‌లైన్ ద్వారా టికెట్లు బుక్‌చేసుకొని వస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని మీడియాకు వెల్లడించారు.
పరిమిత సంఖ్యలో స్వామి దర్శనానికి అనుమతిస్తారు.రోజూ 6వేల మందికి దర్శనం కేటాయిస్తామని తెలిపారు. అలిపిరి వద్ద థర్మల్ స్క్రీనింగ్, శానిటైజేషన్, వాహనాల తనిఖీల అనంతరం దర్శన టికెట్లు ఉన్న వారిని మాత్రమే తిరుమలకు అనుమతిస్తారని చెప్పారు.కేంద్ర ప్రభుత్వ నిబందనలను అనుసరించి 10 సంవత్సరాలలోపు చిన్నారులను, 65 సంవత్సరాలు పైబడిన వృద్దులను ఎట్టి పరిస్థితుల్లో కొండపైకి అనుమతించేది లేదన్నారు.రెడ్‌జోన్ ప్రాంతాలకు చెందిన వారు తిరుమలకు రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఎగ్జిట్ పోల్స్ తనను షాకింగ్ కు గురిచేశాయి: కేఏ పాల్