ఏపీ ప్రభుత్వంపై అనుసరిస్తున్న ఇసుక విధానంపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. ఆన్‌లైన్‌లో నిమిషాల్లో ఇసుక ఖాళీ అవుతోందని దుయ్యబట్టారు. వైసీపీ నాయకుల గుప్పెట్లో మాత్రం వేల టన్నుల ఇసుక. లక్షల లారీల ఇసుక తరలించినా స్టాక్ యార్డ్ లో 20 వేలు చూపించడం లేదు. లారీ ఆపిన అధికారులకు బెదిరింపులు వస్తున్నాయన్నారు.
మీ నేతల అండర్ కవర్ అవినీతితో ఇసుక దోపిడితో రోడ్డున పడ్డ భవననిర్మాణ కార్మికుల కుటుంబాలకు సమాధానం చెప్పండి జగన్ గారు’ అంటూ దేవినేని ఉమ నిలదీశారు. ఈ సందర్భంగా పలు పత్రికల్లో వచ్చిన కథనాలను పోస్ట్ చేశారు. ఇసుకను ఆన్‌లైన్‌లో మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 గంటల లోపు బుక్ చేసుకునేలా ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ అవకాశం కల్పించిందని, అయితే, కొన్ని కేంద్రాల్లో 15 నిమిషాల్లో ఇసుకంతా బుక్ అయినట్లు చూపుతోందని అందులో పేర్కొన్నారు.
కేసీఆర్ కేబినెట్లో మహిళలకు స్థానం కల్పిస్తారా?