telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

నిఖిల్ సినిమాలో మార్పులు చేసిన సుకుమార్…

Nikhil

ప్రస్తుతం నిఖిల్ తో ’18 పేజెస్’ అనే సినిమా తీస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమాకు సూర్యప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే సూర్యప్రతాప్ మొదట సుకుమార్ వద్ద పది చేసిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల సుకుమార్ మరో శిష్యుడు బుచ్చిబాబు సన దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన ఘన విజయం సాధించింది. ఈ సినిమాకు సుకుమార్ నిర్మాతగా వ్యవహరించడంతో పాటు కథ, స్క్రీన్ ప్లే. దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేశాడు. సుకుమార్ వల్లే ఉప్పెన అంత పెద్ద హిట్ అయిందనేది ఇండస్ట్రీ మాట. దీంతో బన్నీ వాసు కూడా ’18 పేజెస్’ను సుకుమార్ చూపించగా… ఆయన కొన్ని మార్పులు చేర్పులు చేశారట. దాంతో కొన్ని కీలక సన్నివేశాలను రీషూట్ చేయమనగా… దర్శకుడు సూర్య ప్రతాప్ ఆ పనిలో ఉన్నాడట. వచ్చే నెలలో ఈ షూట్ జరగనుందట. అయితే ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

Related posts